జిల్లా గణాంక దర్శిని 2019- 20 ఆవిష్కరణ – జిల్లా కలెక్టర్ హరీష్

జిల్లా గణాంక దర్శిని 2019- 20 ఆవిష్కరణ – జిల్లా కలెక్టర్ హరీష్

ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో రూపొందించిన జిల్లా గణాంక దర్శిని -2020 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సోమవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇట్టి గణాంక దర్శినిలో జిల్లా సమాచారంతో పాటు వివిధ శాఖల ద్వారా అమలవుచున్న కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలపై గణాంక రూపంలో పొందు పరుస్తూ రూపొందించిన ఈ పుస్తకం అందరికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యా నాయక్, ఆ కార్యాలయ డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post