జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ బి .గోపి

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ బి గోపి.

గురువారం డి.ఆర్.డి.ఓ కార్యాలయాన్ని, ట్రైనింగ్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

స్కిల్ డెవలప్మెంట్ పై యువతకు ఇస్తున్న ట్రైనింగ్ వివరాలను జె.డి.ఎం అంజలిని అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు 13 బ్యాచ్ లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు 14 బ్యాచ్ కు ట్రైనింగ్ ఇస్తున్నామని అంజలి కలెక్టర్కు తెలిపారు.

శిక్షణ పొందుతున్న యువతను వారికి కావలసిన మౌలిక సదుపాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

యువతను సేల్స్ ప్రమోటర్గా కాకుండా వివిధ రంగా లలో నిష్ణాతులుగా తయారయ్యేలా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

మనం నేర్చుకునేది ఏదైనా ఎప్పటికైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని, శిక్షణ సమయంలో జాగ్రత్తగా అన్ని విషయాలు అడిగి తెలుసుకొని అన్ని రంగాలలో పనిచేయుటకు కార్యసిద్ధి లై ఉండాలని కలెక్టర్ తెలిపారు.

యువతకు ప్రభుత్వం అమలు పరుస్తున్న అన్ని పథకాల వివరాలను, ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకు లావాదేవీలను అలాగే వివిధ పారిశ్రామిక రంగాల హెచ్ ఆర్ ల గురించి
ప్రముఖ వ్యాపార రంగాల ల హెచ్ ఆర్ ల తో శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ తెలిపారు.

శిక్షణ పొందుతున్న యువతకు నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సంపత్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post