జిల్లా నుండి ఇసుక అక్రమ రవాణ జరిగితే తప్పనిసరిగా సీజ్ చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

జిల్లా నుండి ఇసుక అక్రమ రవాణ జరిగితే తప్పనిసరిగా సీజ్ చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో జరిగే ప్రభుత్వ పనులు, ఆలంపూర్ లో సబ్ సెంటర్ పనులు, మిషన్ బగిరథ పనులకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని, ఇసుక తవ్వే ప్రాంతాలలో వి ఆర్ ఏ లను డ్యూటీ వేసి రాత్రి సమయాలలో పర్యవేక్షణ నిర్వహించాలని అన్నారు. ఇసుక కుప్పలు ఉండే అవకాశమున్న చోట తప్పని సరిగా రాత్రి డ్యూటీ లు వేయాలని అన్నారు. అక్రమ రవాణా చేస్తునారని , అక్రమ రవాణా ను అరికట్టాలని, పోలీస్ మరియు రెవెన్యు అధికారులు ఒక్కటే పద్ధతి లో ఉండాలని ,, జిల్లా నుండి ఇసుక బైటికి వెళితే మాత్రం తప్పని సరిగా సీజ్ చేయాలనీ ,కటిన చర్యలు తీసుకోవాలని సంబదిత అధికారులు అందరు సహకరించాలని తెలిపారు .ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ పనులకు ఇసుక సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు.
ఆలంపూర్ శాశనసభ్యులు డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ ఎవ్వరైనా ఇసుక తీసుకోవాలంటే ఏ డి మైన్స్ నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు. జిల్లా నుండి వేరే జిల్లాకు ఇసుక తరలిస్తే మాత్రం చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అన్నారు. జిల్లా లో స్తానికంగా ఇసుక వాడుటకు ట్రాక్టరులకు అనుమతి ఇవ్వాలని కోరారు. పెండింగ్ లో ఉన్న మిషన్ బగిరథ పనులకు ఇసుక అందుబాటులో ఉండే టట్లు చూడాలని తెలిపారు.
రాజోలి, ఉండవెల్లి, ఆలంపూర్ మండలాలకు సంబందించిన తహసిల్దార్లు వారి మందలలో ఉన్న ఇసుక సమస్యలను కలెక్టర్ గారికి వివరించారు.
సమావేశం లో డి ఎస్ పి రంగ స్వామి, ఏ డి మైన్స్ అధికారి విజయ రమ రాజు, సి పి ఓ లక్ష్మన్, ఇరిగేషన్ విజయ మోహన్ రెడ్డి, తహసిల్దార్లు శ్రీనివాస్ జోషి, బద్రప్ప, విజయ భూపాల్ రెడ్డి, జియాలజిస్ట్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ జిల్లా గారిచే జారీ చేయనైనది

Share This Post