జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవలపై అవగాహన : ఇంఛార్జి అద్యక్షులు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యం. నాగరాజు , కార్యదర్శి జి. వేణులు

పత్రికా ప్రకటన
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవల పై అవగాహన
నల్గొండ,ఆక్టోబర్ 2. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) వారి ఆదేశాల మేరకు దేశ నలుమూలల, సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించుటకై అక్టోబర్ 2, 2021 నుండి నవంబర్ 14, 2021 వరకు. 6 వారాల ప్రచార ప్రారంభ కార్యక్రమం, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 వ తేదీ ప్రభాత్ ఫెరిస్ కార్యక్రమాన్ని
న్యాయ సేవా సదన్ లొ ఉమ్మడి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఇంఛార్జి అద్యక్షులు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యం. నాగరాజు , కార్యదర్శి జి. వేణులు నిర్వహించారు. అలాగే, ఈ సంవత్సరం భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని “ఆజాది కా అమృత్ మహోత్సవం” జరుపుకుంటుంది . అంతేకాక జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బముగా కూడా ఈ కార్యాక్రమాన్ని ఘనంగా భారత దేశము అంతటా నిర్వహించడమైందని , యింకా చట్టాలు, రాజ్యాంగ అంశాలు తెలువని వారు అనేకంగా ఉన్నారని, వారిని చైతన్య పరిచటమే ఈ కార్యక్రమ లక్ష్యం అని తెలిపి, మహాత్మా గాంధి మనందరికీ స్పూర్తి దాయకమని, సహనం నిస్వార్థం, నిజాయతీతో, నేర రహిత సమాజం వర్ధిల్లాలని, నిబద్దతతో కూడిన మనుగడ సాగించాలని అప్పుడే గాంధి కలలుగన్న దేశము అవుతుందని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమము నిర్విఘ్నంగా సాగాలని తెలిపారు. కార్యదర్శి జి. వేణు మాట్లడుతూ పాన్ ఇండియా అవేర్‌నెస్ & అవుట్‌రీచ్ క్యాంపెయిన్ ద్వారా, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన మరియు మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు, న్యాయ సేవల సంస్థల పనితీరు, ఉచిత న్యాయ సేవల లభ్యత, వారికిగల చట్టపరమైన హక్కులు మరియు రాజ్యాంగం ప్రకారం హామీ ఇవ్వబడిన హక్కుల గురించి సాధికారత కోసం ఈ ప్రచార కార్యక్రమము నిర్వహించబడుతుందని తెలిపి
ప్యానెల్ లాయర్స్ మరియు పారా లీగల్ వాలంటీర్లకు లిటరసీ పాంప్లెట్స్ బుక్స్ అందచేసి అవగాహన కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కోరారు. నల్గొండ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మేడ మోహన్ రెడ్డి మరియు కార్యదర్శి ఎ. వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్యానెల్ న్యాయవాదుల రూపేణా ప్రజలకు న్యాయ సేవలు, సలహాలు అందజేస్తూ న్యాయవాదులు సేవలు అందిస్తున్నారని, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో న్యాయ సేవా అధికార సంస్థతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమములొ అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి, సీనియర్ సివిల్ జడ్జి యం. వెంకటేశ్వర్ రావు, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ కె. రాణి మహాత్మా గాంధీ కలలను నిజం చేయాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమములొ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ మరియు బృందం చైతన్య గీతాలను ఆలపించి అందరినీ చైతన్య పరిచారు. కార్యక్రమములొ ఎ. యస్. ఐ. విజయలక్ష్మి, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గోన్నారు.జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో గౌరవ భారత రాష్ట్రపతి మరియు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించారు. తదుపరి న్యాయ సేవా అధికార సంస్థ చట్టం అంశాలను తెలుపుతూ రూపొందించిన ప్లకార్డ్స్ ను పారా లీగల్ వాలంటీర్లచె ప్రదర్శన చేస్తూ షి టీం వారి చైతన్య గీతాలతో క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

 

Share This Post