జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దేవరకొండ లో న్యాయ విజ్ఞాన సదస్సు : ప్రిన్సిపల్, జిల్లా సెషన్ జడ్జి, అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ : ఎం.వి.రమేష్

పత్రికా ప్రకటన తేదీ 13.11.2021
నల్గొండ

రాజ్యాంగం కల్పించిన
చట్టాలు ,హక్కుల పై అవగాహన పెంపొందించుకోవాలి

ప్రిన్సిపల్, జిల్లా సెషన్ జడ్జి, అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ : ఎం.వి.రమేష్
# మానవతా విలువలు,నేర్చు కున్న విజ్ఞానం ముందు తరాలకు అందించాలి

# జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దేవర కొండ లో న్యాయ విజ్ఞాన సదస్సు

#పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్, అదనపు జిల్లా జడ్జీ యం. నాగ రాజు,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్,దేవర కొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజ నేయులు
0000

దేవరకొండ(నల్గొండ),నవంబర్ 13. రాజ్యాంగం చట్టాలపై,పౌరులకు కల్పించిన హక్కు లపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ జిల్లా,సెషన్ జడ్జి ,అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నల్గొండ ఎం. వి.రమేష్ అన్నారు.

శనివారం దేవర కొండ పట్టణం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలను అనుసరించి ఆజాది క అమృత్ మహోత్సవ్ లో రాష్ట్ర,జిల్లా,మండల న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా గడప గడపకు,అందరికి సమాన న్యాయం అందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవలు,లోక్ అదాలత్ ల నిర్వహణ, సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖలు ద్వారా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించారు, సమయం వృధా కాకుండా సమస్య పరిష్కారానికై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ను సంప్రదించాలని , లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గం లో సివిల్,రాజీ పడదగిన క్రిమినల్ కేసులను రాజీ మార్గం లో,సామ రస్యం గా పరిష్కారం చేసుకోవచ్చని,ఇందుకు లోక అదాలత్ లను వినియోగించుకోవాలని కోరారు. న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాది ని నియమించి న్యాయ సహాయము అందించగలదని ప్రజలు న్యాయసేవాధికార సంస్థ గురించి అవగాహన పెంపొందించుకోవాలనిప్రజలు ఎల్లప్పుడూ చట్టాలను అనుసరించాలని అప్పుడు మాత్రమే సమస్యలకు గురికాకుండా వీలవుతుందని అన్నారు.జ్ఞానం చాలాముఖ్యమైనది,జ్ఞానం దోచుకోలేనిది,ఎంత పంచితే అంత పెరుగుతుందని అన్నారు.జీవితం వరకు జ్ఞాన సముపార్జన లక్ష్యం గా ఉంటే సుఖం లభిస్తుందని అన్నారు.రాజ్యాంగ చట్టం అన్ని చట్టాలకు తల్లి చట్టం లాంటిదని అన్నారు.రాజ్యాంగం చట్ట ఉద్దేశం శాంతి,సుఖం ఇవ్వడమే .స్వేచ్చ,సమానత్వం, న్యాయం అందించడమే రాజ్యాంగ లక్ష్యాలు అన్నారు.చట్టం ముందు అందరూ సమానం,సమానత్వం కాపాడటానికి పోలీస్,కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థ లు పని చేస్తున్నట్లు తెలిపారు.నిన్ను నీవు ఎలా చూసుకుంటావో ఇతరులను అలా చుస్తే సమానత్వం వస్తుందని,అందరినీ సమానంగా చూస్తే నే రాజ్యాంగ విలువలు కాపాడ బడతాయి అన్నారు.సమానత్వం, అందరికి సమ న్యాయం కల్పనలో కులం,మతం,ప్రాంతం చూడ వద్దని అన్నారు.మనం నేర్చుకున్న విజ్ఞానం,విలువలను మన వారసులకి అందించాలని అన్నారు.దేవరకొండ ప్రాంతంలో ఆడ పిల్ల పుడితే పురిటి లో బ్రూన హత్యలు చేస్తున్నారని,మూఢ నమ్మకాలు ఉన్నాయని అన్నారు
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. మానవ అభివృద్ధి తోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సం. లు పూర్తి అయినప్పటికీ ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంద లేదని దరఖాస్తులు వస్తాయని అన్నారు.హక్కుల గురించి చైతన్యం ఉన్న వారు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి,కొట్లాడి పరిష్కరించు కుంటారని అన్నారు. పథకాలపై అవగాహన లేక ఫలాలు పొందలేక పోతారని, ఎస్.సి.,ఎస్.టి.,మైనార్టీ లు,మురికి వాడల ప్రజలు ఉంటారని అన్నారు.ప్రతి శాఖ ద్వారా లక్ష్యం కు అనుగుణంగా ప్రతి వ్యక్తికి తల్లి గర్భం లో నుండి మరణించే వరకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయని అన్నారు.ఇక్కడ అవగాహన పొందిన వారు ప్రతి గ్రామం లో అందరికీ అవగాహన కలిగించాలని అన్నారు.
డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం,జాతీయ,రాష్ట్ర,జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ లు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదని తెలిపారు. చట్టాల పై అవగాహన లేకనే సమస్యలు ఎదుర్కొంటున్నారని, పరిపాలనా పరం గా ఎదురయ్యే సమస్యలు కూడా ఉంటాయని అన్నారు. దైనందిన జీవితం లో చుట్టూ జరిగే పరిస్థితులు గమనించి అవగహన పొంది ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు.చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని,నిజం ఎప్పటికి గెలుస్తుందని అన్నారు. చట్టాల పై ఉన్న పరిజ్ఞానం సమాజ హితం కు ఉపయోగించాలని అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల కు సంబంధించి ఎటువంటి సమస్య పై దరఖాస్తు ఇచ్చినా సంబంధిత శాఖ దృష్టికి తీసుకు వెళుతామని అన్నారు.ఈ సదస్సు లో జిల్లా వైద్య,ఆరోగ్యా శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఎస్.సి.కార్పొరేషన్, ఎస్.సి.,బి.సి.ఎస్ టి ,మైనార్టీ శాఖల అధికారులు తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు వివరించారు. ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ అధికారి రాజ్ కుమార్,జిల్లా మత్స్య అధికారి వెంకయ్య,డిప్యూటీ కమిషనర్ కార్మిక శాఖ రాజేంద్ర ప్రసాద్,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సల్మా భాను,,జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి భిక్ష పతి తదితరులు పాల్గొన్నారు.డి.ఆర్
డి.ఓ ద్వారా స్వయం సహాయక గ్రూప్ లకు చెక్కులు అంద చేశారు.

Share This Post