జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ*

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నల్లగొండ పట్టణములో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, కళాశాల ఎన్. సి. సి, ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో   మానవ హక్కులు- చట్టాలు అంశంపై అవగాహన సదస్సును   నిర్వహించారు.  కార్యక్రమములో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు  మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడటమే మానవ హక్కు , ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన ఇంకా ఉల్లంఘన జరగడానికి కారణం మనుషుల మద్య అసమానతలు , ఆర్థిక అత్యాశలు, చట్ట ప్రకారం నడవకపోవటం, రాజ్యాంగం సూచించిన బాధ్యతలు నిర్వర్తించలేకపోవటం, విజ్ఞానం, నాగరికత సమ సమాజ స్థాపనకు దోహదం చేయాలని , ప్రతీ మనిషి సాటి మనిషిని మానవత్వముతో స్పృశించనప్పుడే మానవ సంఘం వర్ధిల్లుతుందని తెలిపి న్యాయ సేవా అధికార సంస్థ చట్టం ద్వారా అందరికీ సమ న్యాయం అందుతుందని, ఏదేని చట్ట పరమైన సమస్యలకు న్యాయ సేవా సంస్థలను ఆశ్రయించవచ్చని తెలిపారు.  కార్యక్రమములో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె నరేంద్రకుమార్, వొకేషనల్ ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎన్. రామకృష్ణలు మానవ హక్కులు వర్డిల్లాలంటే క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన  జీవితాన్ని అవలంబించాలని , విద్యార్థిగా విద్యను ఆర్జించటమే కాని చెడు వ్యసనాలకు బానిసలైన జీవితాలను పాడుచేసుకోవొద్దని తెలిపారు. కార్యక్రమములో  న్యాయవాది  ఎన్ బీమారర్జున్ రెడ్డి ప్రథమ సమాచార నివేదిక, బెయిల్, క్రిమినల్ చట్టాలు , ముద్దాయిలు, అరెస్ట్ కాబాడిన, అరెస్టు అయిన వారికి ఉండే హక్కులపై అవగాహన కల్పించారు.
ఎన్. సి. సి ఆఫీసర్          జి. వెంకటేశ్వర్లు, సీనియర్ అధ్యాపకులు మహ్మద్ ఇస్మాయిల్, డా. అన్సారీ , వెంకన్న,
పి. డి. మహ్మద్ హస్సేన ,  లైబ్రేరియన్ జానయ్య పాల్గొనగా , జాగృతి పోలీసు కళా బృందం హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్, శేఖర్, సత్యం, పురుషోత్తం చైతన్య గీతాలు ఆలపించి విద్యార్థులను చైతన్య పరిచారు.

Share This Post