జిల్లా పరిపాలనాధికారితో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్పీ కె. మనోహర్ అన్నారు

జిల్లా పరిపాలనాధికారితో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్పీ కె. మనోహర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాకు ఎస్పీ గా డా. వై సాయిశేఖర్ స్థానంలో నూతనంగా నియమితులైన ఎస్పీ కె. మనోహర్, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ రావు సోమవారం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లాలో ఉన్న సమస్యలు శాంతిభద్రతల విషయాలు చర్చించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతుందని తెలియజేసారు.
అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ రావు ఉన్నారు.

Share This Post