జిల్లా పరిషత్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇ.వి.యం. గోదాం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనీ:: జిల్లా కలెక్టర్ డి. హరిచందన

జిల్లా పరిషత్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇ.వి.యం. గోదాం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ డి. హరిచందన పబ్లిక్ హెల్త్ కార్యనిర్వాహక ఇంజనీర్ విజయ భాస్కర్ ను ఆదేశించారు.  మంగళవారం ఉదయం ఇ.వి.యం. గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు.  పనులు వేగవంతంగా పూర్తి చేయాలనీ జనవరి, 22 వరకు పూర్తి చేసేటట్లు చూడాలన్నారు.  గోదాం నిర్మాణ ప్రదేశం  గుండా వెళుతున్న విద్యుత్ లైనును వెంటనే పక్కకు మార్చాలని విద్యుత్ శాఖ ఎ.ఇ. ని ఆదేశించారు.  గోదాం పూర్తిగా సురక్షితంగా ఉండేటట్లు చుట్టూ ఎత్తైన ప్రహరి నిర్మించాలని, దారి సైతం కేవలం ఒకే చోట ఉండే విధంగా నిర్మాణం జరగాలని సూచించారు.  అత్యంత సురక్షితంగా ఉండే విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం జరగాలని సూచించారు.  పక్కనే సమీకృత మార్కెట్ నిర్మాణం పై మాట్లాడుతూ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని పబ్లిక్ హెల్త్ అధికారిని ఆదేశించారు.  ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణం సైతం త్వరగ పూర్తి అయ్యేవిధంగా చుడాలన్నారు.  పబ్లిక్ హేల్త్ కు ఇచ్చిన పనులు అన్నియు త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారి  నడక దారి (ఫుట్ పాత్), డ్రైనేజ్ పనులు త్వరగా చేపట్టాలని సూచించారు.

పబ్లిక్ హెల్త్ కార్యనిర్వాహక ఇంజనీరు విజయభాస్కర్, కాంట్రాక్టర్ నాగి రెడ్డి, డి.టి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post