జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్

పత్రికా ప్రకటన తేది:2.9.2021
వనపర్తి.

విద్యార్థుల చదువుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్( లోకల్ బాడీ) అంకిత్ అన్నారు.
గురువారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో చర్చించి ఆన్ లైన్ పాఠాలు, ప్రత్యేక తరగతుల గురించి విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని వంటగదిని, అక్కడి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు అదనపు కలెక్టర్ కు వివరించారు. అదేవిధంగా పౌష్టికాహారం కొరకు వారానికి మూడు రోజులు కోడిగుడ్లను అందిస్తున్నారని పాఠశాల సిబ్బంది, అదనపు కలెక్టర్ కు తెలిపారు.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సిబ్బంది ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నాయా, లేదా అని తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తారాబాయి, తదితరులు పాల్గొన్నారు.
………………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post