జిల్లా పరిషత్ లో స్థానికుల సంస్థల MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

7- కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్
0000

7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్న సందర్భంగా జెడ్పీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు. పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, పోలింగ్ ఏజెంట్లు కూర్చునే వరుస క్రమము, కంపార్ట్మెంట్, లైటింగ్, తాగునీరు, ర్యాంప్ తదితర అంశాలను పరిశీలించి ఇంకా ఏర్పాటు చేయవలసిన వాటి గురించి అధికారులకు సూచించారు.

కలెక్టర్ వెంట ఆర్డిఓ ఆనంద్ కుమార్, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ సుధాకర్ తదితరులు ఉన్నారు.

Share This Post