జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన. తేది:27.11.2021, వనపర్తి.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా అవగాహన కల్పించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి ఆదేశించారు.
శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని, జిల్లా అభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
జిల్లాలోని రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు.
తదుపరి జిల్లా పరిషత్ సమావేశ తేదీని త్వరలో తెలియబరుస్తామని తెలుపుతూ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post