జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:05.01.2022, వనపర్తి.

అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధిస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి అధ్యక్షతన, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో వనపర్తి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నదని ఆయన తెలిపారు. గిరివికాస్, ధరణి, వైద్య, ఆరోగ్య, ఫిషరీస్ రంగాలలో మన జిల్లా ముందంజలో ఉన్నట్లు మంత్రి వివరించారు. వికలాంగులకు అందించే పెన్షన్, ఆర్థిక, ఉపాధి అవకాశాలను కల్పించటంలో అన్ని జిల్లాల కన్నా మన జిల్లాకు ఎక్కువ తోడ్పాటును అందించామని మంత్రి తెలిపారు. 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు సేవలు అందిస్తున్నట్లు ఆయన సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో మన జిల్లా 34 వ. స్థానంలో వున్నట్లు మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని మంత్రి తెలిపారు. జిల్లాకు కొత్తగా విద్యుత్ శాఖ ఎస్.ఈ. కార్యాలయము మంజూరు అవుతున్నట్లు, దీని ద్వారా 3 వేల విద్యుత్ నియంత్రికలు సిద్ధమవుతున్నట్లు మంత్రి వివరించారు. 5 వందల ట్రాన్స్ఫార్మర్లు మంజూరు అయ్యాయని, 5 వందల ట్రాన్స్ఫార్మర్లు రావాల్సి ఉన్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిదవ విడత రైతుబంధు అందించడంలో రూ.50 వేల కోట్లు పైగా లబ్ధిదారులకు అందించినట్లు ఆయన తెలిపారు. జెడ్ పి టి సి, ఎంపీటీసీ లకు ఇవ్వవలసిన నిధులలో వనపర్తి జిల్లా ముందంజలో ఉన్నదని ఆయన వివరించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీలలో అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మన రాష్ట్రంలో వనపర్తి జిల్లా టాప్ 5 లో వున్నదని జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు శ్రద్ధ వహించాలని ఆమె అన్నారు. కరోనా వ్యాక్సిన్ లు 15 నుండి 18 సం.ల వయస్సు కలిగిన టీనేజర్స్ కు ఇవ్వడం జరుగుతుందని, మరో రెండు, మూడు రోజుల్లో లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీలకు, పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించుటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ హరితహారం, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో వనపర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
డి ఆర్ డి ఎ. నరసింహులు మాట్లాడుతూ రూ.135 కోట్ల పనులను గుర్తించడం జరిగిందని, రెండు, మూడు రోజుల్లో కేంద్ర బృందం జిల్లాకు పర్యవేక్షణ కొరకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో విద్య,వైద్య, వ్యవసాయం, తదితర శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post