జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన              8 9 2021,  వనపర్తి.

వనపర్తి జిల్లా అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని వనపర్తి అన్నారు.

బుధవారం వనపర్తి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరగ్గా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయా శాఖల ప్రగతి నివేదిక లో చదివి వినిపించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1ఒక లక్షా70 వేల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేయడం జరిగిందని, ప్రత్తి పంట సాగు తక్కువయిందని, వరి పంట సాగు ఎక్కువైందని తెలిపారు. వరి పంట సాగు గణనీయంగా తగ్గించి వేరుశనగ పంట విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రైతు సద్వినియోగం చేసుకోవాలని రైతులతో సమావేశాలు నిర్వహించి భూసార పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రైతు బీమా అందరూ నమోదు చేసుకోవాలని, రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వైద్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 104 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, రెండు బస్తీ దవాఖాన వనపర్తి, కొత్తకోట లో పనిచేస్తున్నాయని వైద్యాధికారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రసవానంతరం గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ధరణి సేవల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ, పశుసంవర్ధక శాఖ, జిల్లా పంచాయితీ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సభకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఈ ఓ రవీందర్ చందు నాయక్, నిషిత, యాదమ్మ, అనిల్, డిఆర్డివో నర్సింలు డి పి.వో. సురేష్ ఈ ఈ మల్లయ్య.జెడ్పీటీసీలు, కో ఆప్షన్ మెంబర్ మునీర్ ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ……………………………

జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post