జిల్లా పర్యాటక ప్రాంతాలకు అనువైన ప్రాంతమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 

సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం క్లబ్ నందు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ  భద్రాచలం నందు రామాయణ థీమ్ పార్కు ఏర్పాటు, భక్తులకు సౌకర్యాలు కల్పనతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దనున్నట్లు చెప్పారు.  కిన్నెరసానిలో బోట్ షికారు నిర్వహిస్తున్నామని రాష్ట్రములోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పారు.  12 కోట్ల రూపాలయతో చేపట్టిన బడ్జెట్ హోటల్, కిన్నెరసానిలో అద్దాల మేడ పనులు జరుగుతున్నాయని చెప్పారు. డాం వద్ద  ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి శ్రీనివాస్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నకళాకారులకు ప్రశంషా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post