జిల్లా పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం

ఇండియన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు,జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డి గారిని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా తన కార్యాలయం లో కలవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు తన కార్యవర్గాన్ని పాలనాధికారికి పరిచయం చేసారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జిల్లా రెడ్ క్రాస్ కి మంచి పేరు తేవాలని కోరారు.విభిన్న కార్యక్రమాలు చేపట్టి ఆపన్నులకు అండగా నిలవాలని అన్నారు రెడ్ క్రాస్ కి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు .రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు తనవంతు చేయూతగా నిజామాబాదు మరియు మోపాల్ బీ.సి వసతి గృహాల విద్యార్థులకు 100 దుప్పట్లు పాలనాధికారి చేతుల మీదుగా పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ రెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ,కోశాధికారి కరిపే రవీందర్ ,సహాయ కార్యదర్శి పోచయ్య మరియు ఈ.సి మెంబెర్స్ కే సూర్యనారాణయ , వెంకట కృష్ణ అలాగే ఎం.సి మెంబెర్స్ డా నీలి రాంచందర్, అబ్బాపూర్ రవీందర్,సోలొమన్,మాణిక్యాల శ్రీనివాస్ ,జి హన్మంత్ రావు, బంగ్లా గంగారెడ్డి,పోతన్ రావు,వై శ్రీనివాస్ రావు,ఎం నాగార్జున రెడ్డి అలాగే నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా శ్రీశైలం, ఆర్మూర్ డివిజన్ చైర్మన్ వెంకటేష్ గౌడ్,బోధన్ డివిజన్ చైర్మన్ బసవేశ్వర రావు మరియు బండారి బల్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post