జిల్లా పోలీసు కార్యాలయ సముదాయాన్ని త్వరితగతిన సిద్ధం చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని త్వరగతిన సిద్ధం చేసి, ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి*

*ప్రగతిలో ఉన్న పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి*

*రాష్ట్ర డీజీపీ శ్రీ ఎం. మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు*

*రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ తో కలిసి పోలీస్ కార్యాలయ పనుల పురోగతిని పరిశీలించిన డీజీపీ*

సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ యం. మహేందర్ రెడ్డి, ఐపీయస్ గారు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, ఐపీఎస్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎస్పీ డాక్టర్ చేతన్ ఐపీయస్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ అధికారులతో కలిసి సందర్శించి నూతన భవనాల నిర్మాణం జరిగిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పోలీస్ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులతో నిర్మాణ దశలో పెండింగ్ లో ఉన్న పనుల వేగవంతంకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

*ఈ సందర్భంగా డీజీపీ శ్రీ యం. మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ*

ప్రజలకు సత్వర పోలీస్ సేవలు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని హంగులతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల సముదాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కాంట్రాక్టర్స్, డిజైనర్స్, ఆర్కిటెక్చర్స్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో వారు చెప్పిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందాని తెలిపారు. జిల్లా ప్రజలకు అందుబాటులో, ఎల్లవేళలా సేవలందించడానికి జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుగా జిల్లా పోలీసు కార్యాలయాలు, కమీషనర్ కార్యాలయాలు నూతన జిల్లాల్లో నిర్మించడం జరుగుతుందని అన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని, దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ లో పోలీస్ శాఖకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. పోలీస్ శాఖలో మొదటి ప్రాధాన్యతగా రాష్టంలో అన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, తరువాత పోలీస్ అధికారులు ఉండేందుకు క్యాంప్ కార్యాలయాలు పోలీస్ సిబ్బంది ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్, అదనపు ఎస్పీ చందయ్య, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, డిఎస్పీ చంద్రకాంత్, T.శ్రీనివాస్ EE T.విశ్వనాథం DEE ,ఎల్.రాజశేఖర్ ఏఈ సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, వెంకటేష్,ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

Share This Post