జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు…

జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు…

ప్రచురణార్థం

మహబూబాబాద్ జూన్ 1

జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి బంగారు తెలంగాణ సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అందుకు ప్రజల సహకారం కూడా తోడవడంతో దశాబ్ద కాలంగా ఎంతో అభివృద్ధి సాధించుకొని అన్ని రాష్ట్రాలతో సమానంగా ప్రగతి సాధించుకుంటూ ముందుకు పోతున్నట్లు తెలియజేశారు.

ఈ అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులు అధికారుల కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సహకారం మున్ముందు కూడా ఇవ్వాలని బంగారు తెలంగాణ గా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ ముందుకు పోవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తిచేసుకుని దశాబ్ది అవతరణ ఉత్సవంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

Share This Post