జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవించాలని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కరోనా మహామ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరోనా ప్రొటోకాల్స్ పాటించాలని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అదనపు డయాలసిస్ కేంద్రాలు, సిటి స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతమైనప్పటికీ జిల్లా ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో ఆసక్తి చూపి నూరు శాతం వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని, అలాగే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుని నూరుశాతం ప్రక్రియను పూర్తి చేయుటకు సహకరించాలని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు. చేయనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరంలో మన జిల్లాను చెత్త రహిత జిల్లాగా తయారు చేయుటకు చర్యలు చేపడుతున్నామని, పట్టణమైనా, గ్రామమైనా ఎక్కడా రోడ్డు మీద వ్యర్థాలు కనబడకుండా ప్రతి ఇంటి నుండి వ్యర్థాలు సేకరణ చేసి జిల్లాను స్వచ్చ జిల్లాగా మారుస్తామని చెప్పారు. మున్సిపాల్టీలు, పంచాయతీల్లో వ్యర్థాలను కంపోస్టు ఎరువులుగా తయారు చేయుటకు డంపింగార్డుల నిర్మాణ ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెప్పారు. ఇల్లందు, పాల్వంచలలో మొదటి విడతగా మానవ వ్యర్థాలను ఎరువుగా మార్చుటకు చేపట్టిన ప్లికల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో కొత్తగూడెం, మణుగూరులలో కూడా నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. ప్రజలందరి సహాయ సహాకారాలతో స్వచ్ఛ సర్వేక్షణ్ మన జిల్లాకు జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వ్యర్ధాలు గోదావరిలో కలవడం వల్ల పవిత్ర గోదావరి అపవిత్రమవుతున్నదని, గోదావరి పతిత్రను, స్వామి వారి విశిష్టతను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డు నిర్మాణానికి 1.50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. అదే విధంగా కోటి రూపాయలతో యంత్రాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు పరిశ్రమలు ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రధాన, అంతర్గత రహదారుల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి మన జిల్లాను హరితజిల్లాగా తయారు చేయడమే ధ్యేయమని చెప్పారు. జిల్లాలో 110 ప్రాంతాల్లో హరితవనాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలమని, ఇప్పటి వరకు 60 ప్రాంతాల్లో భూమి కేటాయించడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు మిగిలిన 50 ప్రాంతాలకు భూ సేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. హరితవనాలు ఏర్పాటు ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. చిన్నారులు పకృతి మాత వడిలో సంతోషంగా ఆడుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధనకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ అందుబాటులో ఉంచేందుకు పాల్వంచలో గ్రంధాలయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోషణలోపం లేని సమాజం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిలో ప్రత్యేక న్యూట్రిషన్ వార్డు ఏర్పాటు చేసి చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. సిఎస్ఆర్ నిధులు ద్వారా నూతన అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులు చేపట్టనున్నట్లు చెప్పారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన |కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గిట్టుబాటు వచ్చే పంటల సాగును చేపట్టు విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ పక్షాన చేసిన విన్నపాన్ని రైతులు అంగీకరించినందుకు ఆయన దన్యవాదాలు తెలిపారు.

Share This Post