పత్రిక ప్రకటన– 1
తేదీ : 31–12–2022
నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి,
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
నూతన సంవత్సరంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం –2023లో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, ఆశలు, ఆశయాలతో ముందుకెళ్ళాలని కోరారు. ప్రకృతిలో ఉన్న అందాన్ని… సున్నితమైన భావాలను అందమైన మనస్సును హత్తుకొనేలా నూతన సంవత్సరంలో మాత్రమే కాకుండా ప్రతినిత్యం… జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితానికి వారి శ్రేయస్సుతో పాటు ఆనందాన్ని తీసుకువస్తుందని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉన్నతాశయాలను ఏర్పర్చుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు.