జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె.శశాంక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

2022 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కలెక్టర్ ఆకాక్షించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు సత్పలితాలనిస్తున్నాయన్నారు.

రైతులు వరిపంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.

2వ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

హరితహారం కొరకు 461 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి స్థానికంగానే కావాల్సిన మొక్కలు సిద్ధం చేస్తున్నామన్నారు.

మిషన్ భగీరధతో ఇంటింటికి త్రాగునీరు సరఫరా జరుగుతున్నదని, మరుగుదొడ్లు నిర్మాణాలు, పారిశుధ్యం మెరుగుకు స్వచ్ఛ సర్వేక్షన్ కు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మించి
ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టినందున తడి, పొడి చెత్తలను వేరువేరుగా అందజేయాలన్నారు.

వైకుంఠ ధామాలను నిర్మించడంతో పల్లెల రూపు రేఖలు మారాయని తెలిపారు.
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post