జిల్లా ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు.జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్థం

జిల్లా ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు…

మహబూబాబాద్ మార్చి 29.

జిల్లా ప్రజలందరూ తమ బంధుమిత్రులతో శ్రీరామనవమి పండుగ ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక నేడొక ప్రకటన లో తెలిపారు.

సమాజంలో భార్యాభర్తల అనుబంధం బంధుమిత్రుల అనుబంధం లతోపాటు కుటుంబ బాంధవ్యాలు అన్నదమ్ముల అనుబంధం తల్లిదండ్రుల మాటలపై కట్టుబడి ఉండాలని చెప్పిన రామాయణం ఎన్నటికీ విలువలతో కూడిన గాధని తెలిపారు.

నేటికీ ఆ విలువలే కుటుంబాలను అన్యోన్యతగా ఉంచుతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఉన్నతమైన విలువలకు కట్టుబడి ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని కోరారు

Share This Post