జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం :: జిల్లా కలెక్టర్ జి.రవి

జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం :: జిల్లా కలెక్టర్ జి.రవి

పత్రికాప్రకటన                                                                                                          తేదిః 18-07-2021

జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం :: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, జూలై 18: గొల్లపెల్లి మండలం చిల్వకొడూరు గ్రామానికి చెందిన సలీం పాషా జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు కరోన  కారణంగా మరణించడంతో ఖాళీ ఎర్పడిన స్థానానికి అదే గ్రామానికి చెందిన షేక్ అమ్జద్ గారిని కో ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నోటిఫికేషన్ ఆదేశాలకు లోబడి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన, ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కో ఆప్షన్ సభ్యుని ఎన్నికను నిర్వహించడం జరిగిందని, నామినేషన్ ప్రక్రియకు నిర్ణీత సమయంలో ఒకే నామినేషన్ స్వీకరించడం జరిగిందని, నామినేషన్ పరిశీలన అనంతరం  షేక్ అమ్జద్ గారిని కో ఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవంగా  ఎన్నిక చేయడం జరిగిందని పేర్కోన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ,  గతంలో కో ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన సలీంపాషా కరోనా కారణంగా మరణించడం చాలా బాధాకరమని తెలియచేశారు. సదరు ఖాళీ స్థానాన్ని భర్తిచేయడానికి రాష్ట్ర  ఎన్నికల సంఘానికి కొత్త సభ్యున్ని ఎన్నిక కొరకు ప్రతిపాదనలు పంపిన వెంటనే ఎన్నిక ప్రక్రియకు అనుమతులు వచ్చాయాని పేర్కోన్నారు.  ఎన్నికల సంఘం జారి చేసిన ఆదేశాలకు  లోబడి జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి గారి ఆద్వర్యంలో ఎన్నిక కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని  పేర్కోన్నారు.

ఎన్నిక ప్రక్రియలో ఒకే నామినేషన్ రావడంతో షేక్ అమ్జద్ గారి జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనట్లుగా  జిల్లా కలెక్టర్ దృవీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం షేక్ అమ్జద్ కి జిలా కలెక్టర్ మరియు జిల్లా  పరిషత్ చైర్మన్ లు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ జెడ్పి ఛైర్పెర్సన్ హరిచరణ్రావు వివిధ మండలలా జెడ్పిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాలచే జారిచేయనైనది.

జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం :: జిల్లా కలెక్టర్ జి.రవి

జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం :: జిల్లా కలెక్టర్ జి.రవి
జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం :: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post