నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు మేనమామ గా కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ కానుక
222 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 22 లక్షల రూపాయల విలువల చెక్కుల పంపిణీ
రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
0000000
పేదింటి ఆడబిడ్డలు వివాహాల కోసం మేనమామ గా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష రూపాయల చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరీంనగర్ నియోజకవర్గం చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేనన్ని సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. గతంలో పాలించిన వారికి నిరుపేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఆలోచన వారికి రాలేదన్నారు. నిరుపేద ఏంటి ఆడబిడ్డల వివాహానికి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ఎంత కష్టమొచ్చినా సంక్షేమ పథకాలకు లోటు రాకుండా పగడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. గతంలో ప్రక్కనే లోయర్ మానేర్ డ్యాం జలాశయo ఉన్నా తాగునీటికి ఇబ్బందులు పడ్డమని అన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆడబిడ్డలు దీవెన ఇవ్వాలన్నారు. మంత్రి ఈ సందర్భంగా రెండు కోట్ల 25 లక్షల విలువగల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 222 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, తహసీల్దార్లు వెంకట్ రెడ్డి , సుధాకర్ కొత్తపల్లి,మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు