జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షతన జిల్లా ప్రజాప్రరిషత్ సమావేశ మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని తెలిపారు. కరోనాను జయించుటకు అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని అభినందించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు,07 ఖమ్మం:

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షతన జిల్లా ప్రజాప్రరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి రాహుల్, ఇంచార్జ్ జడ్పీ, సి.ఇ.ఓ కె. శ్రీరామ్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో వైద్యఆరోగ్యం, వ్యవసాయ, సంక్షేమ శాఖల నిర్దేశిత లక్ష్యం సాధించిన ప్రగతి అంజెండా అంశాలుగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని తెలిపారు. కరోనాను జయించుటకు అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని అభినందించారు. జిల్లా పరిషత్ పాలక వర్గం ఏర్పడి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయిందని ఈ రెండు సంవత్సరాల కాలంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందించడంలో కీలకంగా పనిచేశామన్నారు. అదేవిధంగా కరోనాను జయించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కరోనాను నివారించగలిగామన్నారు. ఈ సమావేశంలో పలువురు జడ్పీ టి.సి.లు, ఎం.పి.పి.లు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి అందించేలా చూడాలని కోరగా జిల్లా పరిషత్ చైర్మన్ సమాదానం ఇస్తూ ఇప్పటికే జిల్లా సరిహద్దు మండలాలైన మధిర, బోనకల్, వైరా, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆయా మండలాల అధికారులతో సమీక్షించి అధికారులకు కోవిడ్ నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టేందుకు తగు ఆదేశాలు చేయడం జరిగిందన్నారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ కోవిడ్-19 నియత్రించడంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో పలు ఆవాసాలలో అపరిశుభ్రత వాతావరణం గమనించడం జరిగిందని, ఇలాంటి చర్యల వల్ల సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు రైతువేదికలలో డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేసి సంబంధిత అధికారుల పేర్లు వివరాలను తెలపాలని వారు రైతువేదికలలో ఉండే సమయం, తెలపాలని అందుబాటులో ఉండి వచ్చిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ లు ధరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య పనులను నిరంతరాయంగా చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్ను చల్లాలని వారంలో రెండురోజులు మంగళ, శుక్రవారాల్లో “డై డే” తప్పనిసరిగా పాటించాలని, ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలన్నారు.

శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాలలో రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, రైతువేదికలలో పూర్తి స్థాయిలో రైతులకు వ్యవసాయ అధికారులు తగు సలహాలు, సూచనలతో అవగాహన కల్పించి చైతన్యపర్చాలన్నారు. ఆయా మండలాల వారీగా నమోదు అయిన కోవిడ్ కేసులు, అందించిన వ్యాక్సినేషన్ వివరాలు తెలియజేయాలని, కేసులు నమోదు అయిన మండలాల్లో అధికశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వైద్య అధికారులు గ్రామాలలో అధికంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తగు వైద్య సేవలందించాలన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, జడ్చీ.టి.సిలు, ఎం.పి.పిలు, జిల్లా అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post