పత్రికా ప్రకటన
సంగారెడ్డి, జూలై 30:–
జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఆగస్టు 4న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి
సి.హెచ్. ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి సమావేశమునకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావ్ పాల్గొంటారని , పార్లమెంట్ సభ్యులు ,శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ , జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ కో ఆప్టెడ్ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.