జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-1
జనగామ, డిసెంబర్ : 21: మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య రఘునాథపల్లె మండలం నిడిగొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు వివరాలు పాఠశాల ప్రధానోపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఉత్తమ విద్యా బోధనలు అందించి తీర్చి దిద్దాలన్నారు. సిలబస్ ప్రకారం తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాల ఆవరణము పరిశీలించి పిల్లలకు త్రాగునీరు, విద్యుత్, మరుగుదోడ్డ్లు తదితర అన్ని వసతులు కల్పించి ఆహ్లాద కరమైన వాతావరణంలో ఉండే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిదిలావస్థలో ఉన్న పాఠశాల భవనంను తోలిగించాలన్నారు.
అనంతరం నిడిగొండ గ్రామంలో చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వివిధ పనుల నిమిత్తం అందుబాటులో లేని వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించి వారికి వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. ఏ రోజు వ్యాక్సిన్ ఆ రోజే పూర్తి చేయాలన్నారు. వ్యాక్సిన్ గురించి మరింత ప్రచారం నిర్వహించి వేగంగా లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె.రాము, పాఠశాల ప్రధానోపాద్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share This Post