జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్….

జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్….

ప్రచురణార్థం

జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్….

మహబూబాబాద్, మే -08:

జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి ఆదివారం సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ఈనెల 9న, 10 న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో టీచింగ్ హాస్పిటల్ కు భూమి పూజ, ఇప్పటికే 40 కోట్లతో చేపట్టి నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాలను సందర్శించి ప్రధాన జిల్లా ఆసుపత్రికి వస్తారని, ఆసుపత్రి కూడా 350 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయిన సందర్భంగా ఇప్పటికే కొత్తగా ఉపయోగంలోకి వచ్చిన పడకలు, ఒక వైపు కోటీ 10 లక్షలతో నిర్మాణం చేసుకున్న 50 పడకలను, మరొకవైపు చిల్డ్రన్ ఐ.సి.యును, రేడియాలజి, సిటి స్కాన్ కు సంబంధించిన వాటికి శంఖుస్థాపన, మొదటి, రెండు అంతస్తులను 4 కోట్లతో నిర్మాణం చేసుకుంటున్న పనులు పురోగతిలో ఉన్నాయని, 350 పడకలుగా మార్చే క్రమంలో రెండు అంతస్తులను 4 కోట్లతో నిర్మాణం చేసుకుంటున్నామని, ఒక పని పురోగతిలో ఉండి వారం లోపల పూర్తి కానున్నది, ఒక ఫ్లోర్ లో 50 పడకలు పేషేంట్లకు ఉపయోగంలో ఉండాలని దానిని ప్రారంభించుకోవడం జరుగుతుందని, మహబూబాబాద్ జిల్లా సమగ్రంగా అభివృద్ధికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారని, ఇక్కడ ఉన్న అవసరాలు ఏమిటి, ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి, పేదవారికి ఉచితంగా అందుబాటులోకి తీసుకరావచ్చొ వాటిపై సమీక్ష చేస్తారని, వారు వస్తున్న సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ, వారి రాకను ఈ జిల్లా అభివ్రుద్ధికి వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖకు ఉపయోగపడే విధంగా మలచుకోవడానికి ప్రజాప్రతినిధులుగా మెము అందరం ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ తరుణంలో ఈ ఆసుపత్రికి, కొత్తగా వచ్చిన టీచింగ్ ఆసుపత్రికి కావలసిన మొత్తం సిబ్బందిని నియమించుకున్నామని, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనే వారికి సమాధానంగా కె.సి.ఆర్. వలన తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయిందని, మెడికల్ కళాశాల, అలాగే హైదరాబాద్ లో అందిస్తున్న కార్పోరేట్ వైద్యం ఎలా అందుబాటులో ఉన్నదో ఇక్కడి పేదలకు, గిరిజనులకు, దళితులకు ప్రతి ఒక్కరికి ఉచితంగా ప్రభుత్వ పరంగా కార్పోరేట్ తరహా వైద్యం అందుబాటులోకి రావడం సంతోషానిచ్చిందని తెలిపారు. మంత్రి పర్యటనను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని, అది జిల్లా ప్రజలకు, జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలొ పట్టు ఉన్న హరీష్ రావు,ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్.ఆర్.ఎస్.పి. స్టేజ్-1, స్టేజ్-2 పూర్తి చేయడంలో కావచ్చు, పునరుద్ధరణలో కావచ్చు, ఈ ప్రాంతంలో మిషన్ కాకతీయ పనుల పురోగతిని సమీక్షించడానికి గతంలో వచ్చారని, ఇప్పుడు మరొకసారి వస్తున్నారని, వారికి స్వాగతం తెలియజేస్తూ, వారి రాక సందర్భంగా జిల్లాలో అభివృద్దికి అందరం సమీక్షించుకొని ముందుకు వెల్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట్ రాములు, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post