జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ICU కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. ( కరీంనగర్ జిల్లా )

ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసియు పడకలను ప్రారంభోత్సవం.

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
0000

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన 12 ఐ సి యు పడకల గదిని కలెక్టర్ ప్రారంభించారు. హైదరాబాదుకు చెందిన లారస్ ల్యాబ్స్ వారు ఐ సి యు పడకలు తదితర సామాగ్రి కోసం సుమారు రూ. 30 లక్షలు డొనేషన్ ఇవ్వగా, నిర్మాన్ ఎన్జీవో సంస్థ పరికరాలను కొనుగోలు చేసి అమర్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లారస్ లాబ్స్, నిర్మాన్ ఎన్జీవో సంస్థ సేవలను అభినందించారు. కోవిడ్ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు చిన్నచూపు ఉండేదని అన్నారు. కోవిడ్ బారినపడిన రోగులకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో వైద్యులు, నర్సులు అందించిన సేవలతో ఎంతో మంది రోగులు కోలుకున్నారని, దీంతో ప్రభుత్వాసుపత్రి పై రోగులకు నమ్మకం కలిగిందని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ రోగులకు వైద్యులు నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. లారాస్ లాబ్స్ అందించిన డొనేషన్ తో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసీయూ పడకలను కోవిడ్ రోగులే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు అందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ఐసియు పడకల తోపాటు, 25 ఆక్సిజన్ సిలిండర్లు, 2 వెంటిలేటర్లు తదితర సామాగ్రిని అందించడం అభినందనీయ మని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల పై నమ్మకం పెంచుకొని ప్రజలు సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

Share This Post