పత్రికా ప్రకటన తేది 09 -12-2021
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులకు ఆదేశించారు.
గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో అలంపూర్ శాసన సభ్యులు డా. అబ్రహం, జెడ్పి ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, వైద్యాధికారుల ఆధ్వర్యం లో నిర్వహించిన హాస్పిటల్ అభివృద్ధి సొసైటీ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి లో రోగులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. హాస్పిటల్ కి అవసరమైన వాటి గురించి, ఆసుపత్రి లో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి లో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు తెలిపారు. ఆసుపత్రి లో సానిటేషన్ విబాగం లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని, సిబ్బంది కొరత ఉంటే కొత్తవారిని నియమించాలని, ఆసుపత్రి ఆవరణ పరిశుబ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది అందరు రోగులను విసుగ్గోకుండా వారికి పాజిటివ్ గా స్పందించాలని, విధి నిర్వహణ లో జాప్యం చేయకుండా, ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాలని , రోగులను జాగ్రత్త గా చూసుకోవాలని తెలిపారు. డాక్టర్ లు అందుబాటులో లేకపోతే నర్స్ లు వెంటనే స్పందించి డాక్టర్ లకు సమాచారం ఇచ్చి, వారిని ఆసుపత్రి కి పిలిపించాలని అన్నారు.
జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ ఆసుపత్రి లోని వైద్య సిబ్బంది విధులలో అప్రమత్తంగా ఉండాలని, రోగులకు ఎలాంటి నష్టం జరగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి కి వచ్చిన రోగుల పై నిర్లక్ష్యం వహించకుండా వారికి వెంటనే స్పందించాలని, గర్బిణిలు, వృద్ధులపై అధిక దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా జిల్లా ఆసుపత్రి ని అభివృద్ధి చేయడానికి అందరు కృషి చేయాలని అన్నారు.
అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహం మాట్లాడుతూ ఆలంపూర్ ఆసుపత్రికి ఒక అంబులన్స్, గైనకాలజిస్ట్ తప్పనిసరిగా కావాలని వాటి కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఆసుపత్రి లో ఎన్ని పడకలు ఉన్నాయని, బెడ్ ల కొరత ఉంటే ఎక్కువ బెడ్ లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు పంపించాలని, హాస్పిటల్ లో సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. ఆసుపత్రి లో అన్ని ఆపరేషన్ లు చేసేలా స్పెషలిస్ట్ డాక్టర్ లు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
సమావేశం లో వైద్యాదికారి చందు నాయక్, సుపరిటెన్డెంట్ కిషోర్ కుమార్, డాక్టర్ లు, స్టాఫ్ నర్స్ లు, రెడ్ క్రాస్ చైర్మన్ రమేష్ బాబు, వైద్య సిబ్బంది , తద్తితరులు పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.