జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వైద్య శాఖ ఆధ్వర్యం లో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలనీ అన్నారు. ఆసుపత్రికి సంబంధించిన ప్రహారి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ,  ఆసుపత్రి లో జనరేటర్ , మెడికల్ వార్డ్ లో ఎల్.ఈ.డి లైట్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఐ.సి.యు కి సంబంధించిన పనులు పెండింగ్ ఉంటే పూర్తి చేయాలనీ అన్నారు. అయిజ , ఆలంపూర్ ఆసుపత్రులకు సంబంధించిన స్లాబ్ మరియు   పనులు ఇతర నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లా లో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆసుపత్రి లో ఉన్న డయాలసిస్ , ఇతర ల్యాబ్ లలో  అన్ని పరికరాలు పని చెసే విధంగా ల్యాబ్ ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ,రేడియాలజీ ల్యాబ్ కొరకు స్థలాన్ని గుర్తించి, దానికి సంబంధించిన పనులు త్వరగా పుర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.  ఆలంపూర్ ఆసుపత్రికి  ఒక అంబులన్స్, గైనకాలజిస్ట్ తప్పనిసరిగా అవసరమున్నందున  వాటి కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఆసుపత్రి లో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి లో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి లో సానిటేషన్ విబాగం లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని, ఆసుపత్రి ఆవరణ పరిశుబ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది అందరు  రోగులను విసుగ్గోకుండా వారికి   పాజిటివ్ గా స్పందించాలని, విధి నిర్వహణ లో జాప్యం చేయకుండా, ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాలని , రోగులను జాగ్రత్త గా చూసుకోవాలని తెలిపారు. ఆసుపత్రులలో సిబ్బంది కొరత ఉంటే నియమాకాలు చేపట్టాలని , రిక్రూట్మెంట్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి ఒక్క వార్డ్ కు నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, ఆసుపత్రికి సంబంధించిన అన్ని అంశాల పై రివ్యూ చేశారు. రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను విసిట్ చేస్తారని, అప్పటివరకు ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి , పనులు ఏవి పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ శశికళ, శోభ రాణి, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి జయపాల్ రెడ్డి, డి.ఈ. రాఘవన్, ఆర్.ఎం.ఓ  హ్రుశాలి, సుబేద, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post