జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు..ఆసుపత్రికి వచ్చే రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి:- జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు

– ఆసుపత్రికి వచ్చే రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి

– జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

తేదీ 27.07.2022 బుధవారం రోజున జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గౌరవ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ / జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో చైర్ పర్సన్ గారు వాతావరణం లో జరిగిన మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులందరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గౌరవ మంత్రి కేటీఆర్ గారి సూచనలతో జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల చికిత్సకు మందులు, డాక్టర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గానిర్దేశంలో వైద్యం పల్లె ప్రజలకు చేరడంతో పాటు జ్వర సర్వే ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వడం వంటి కార్యక్రమాలుజరుగుతున్నాయన్నారు. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జబ్బుల బారిన పడ్డ వారిని గుర్తించడంతో పాటు చికిత్స అందించడం ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం చేయాలన్నారు.
గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటి రామారావు గారు మన జిల్లా ఆసుపత్రి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అవసరమైన డాక్టర్లను జిల్లాకు తీసుకువచ్చి, జిల్లా ప్రజలకు సకల సౌకర్యాలు, కార్పొరేట్ తరహా వైద్య సేవలు ఏర్పాటు చేసారనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాని ఆరోగ్య జిల్లాగా తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. జిల్లా ప్రజలు హైదరాబాద్, కరీంనగర్ కార్పొరేట్ హాస్పిటల్ లకు వెళ్లకుండా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లోనే వైద్యం అందేలా అధునాతన వైద్య పరికరాలను తెప్పించి కార్పోరేట్ హాస్పిటల్ స్థాయిలో వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి నందు దాడపుగా
గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి ప్రత్యేక చొరవతో మన జిల్లా ఆసుపత్రి 100 పడకల నుంచి 250 పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ కాబడింది. ఆసుపత్రిలో E-ICU సౌకర్యం , కరోనా పేషంట్ల కొరకు ప్రత్యేకంగా కోవిడ్ వార్డు, 32 వెంటిలేటర్స్, 10 డయాలసిస్ బెడ్లు, 35 లక్షలతో పీడియాట్రిక్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని అన్నారు. 10 బెడ్లతో నవజాత శిశుసంరక్షణ విభగాన్ని అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఆదాని గ్రూప్ వారు 1 కోటి 20 లక్షలతో స్పెషలిస్ట్ పరికరాలను ఇవ్వడం జరిగింది. 40 లక్షలతో లిక్విడ్ ఆక్సీజన్ ట్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా మళ్ళీ వస్తున్న తరుణంలో జిల్లా ఆసుపత్రి లో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ మాస్క్, శానిటైజరు తప్పకుండా వాడాలన్నారు . గ్రామాల్లో అధునాతన వైద్య సదుపాయాలు అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

ఈ సమావేశంలో హాస్పిటల్ సూపరిండెంట్ మురళీధర్ రావు, డీఎంహెచ్ ఓ సుమన్ రావు, సభ్యులు జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావు, సభ్యులు మరియు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post