జిల్లా ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం పరిశీలించిన – కలెక్టర్

జిల్లా ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్) కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సముదాయంలోని పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గేటు నుండి కార్యాలయాల వరకు గల ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి పూల చెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సముదాయం ప్రాగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించాలని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, చేతా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
———————-

Share This Post