జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు.

ప్రజల ఆరోగ్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం

జిల్లాలో విషజ్వరాలు కంట్రోల్ లో ఉన్నవి

చర్యలు చేపట్టుటకు అధికారులు, సిబ్బంది, మందులు సిద్ధంగా ఉన్నాయి

జ్వరాలు వస్తే ప్రజలు ఆందోళన చెందవద్దు

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

వర్షాలు,వరదలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

గురువారం మంత్రి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. వార్డుల్లో తనిఖీలు చేసారు. రోగులను పరమార్శించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యల పై వైద్యాధికారులకు సూచనలు చేసారు. ప్లేట్ లెట్ మిషిన్ పరిశీలించి మిషిన్ పని చేస్తున్న తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నరు. క్యాంటీన్ పరిశీలించి… పలువురికి భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విషజ్వరాలు… డెంగ్యూ… మలేరియా జ్వరాలు ప్రబలకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వరదలతో డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ లాంటి జ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురికావద్దని అన్నారు.తమ ఆసుపత్రులకు వచ్చే రోగులను ఆసుపత్రుల నిర్వాహకులు భయాందోళనకు గురిచేయొద్దున్నారు. రోగుల నుండి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి అన్నారు. డెంగ్యూ పరీక్షను ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించి డెంగ్యూను నిర్ధారిస్తామని తెలిపారు. జిల్లాలో జ్వరసర్వే కొనసాగుతుందని, జిల్లాలో ప్రస్తుతం 6 కొవిడ్ కేసులున్నాయని 3 కేసులు ప్రభుత్వాసుపత్రిలో 3 కేసులు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాలేదన్నారు.13 మందికి టైఫాయిడ్ పరీక్షలు ఒకరికి పాజిటివ్ గా తేలిందని,22 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వీరంతా ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటున్నారు.జ్వరం వస్తే ప్లేట్ లెట్లు తగ్గడం సాధారణమే… ప్లేట్ లెట్స్ తగ్గినంత మాత్రానా ప్రజలు భయాందోళనకు గురికావల్సిన అవసరం లేదని,జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్ లెట్స్ పెరుగుతాయని అన్నారు. జిల్లాలో విషజ్వరాలు అదుపులో ఉన్నాయని ఏ చిన్న జ్వరం వచ్చినా ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్లేట్ లెట్ మిషిన్ అందుబాటులో ఉందని తెలిపారు. వర్షాలతో కొత్త నీరు వచ్చి చేరిందని,కాచి చల్లార్చిన నీటిని తాగాలి
జిల్లాలో మందులకు కొరత లేదని,ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్ ,డెంగ్యూ నియంత్రణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. డెంగ్యూ ను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోనే రక్త పరీక్ష చేసి నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఏమైనా డెంగ్యూ కేసులు వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన కూడా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాధుల నియంత్రణకు మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో వైద్య సిబ్బంది బృందంగా ఏర్పడి డెంగ్యూ వ్యాధి వచ్చిన వ్యక్తి ఇంటి నుండి వంద మీటర్ల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని యాంటీ లార్వా స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. దోమల వల్లే టైఫాయిడ్ మలేరియా వ్యాప్తి చెందుతుందని ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తి చెందకుండా డ్రై డే పాటించాలన్నారు. ప్రజలు నీటిని కాచి చల్లారిన తర్వాత కావాలని, పరిశుభ్రమైన భోజనం తీసుకోవాలని అన్నారు.

Share This Post