జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక సిటి స్కాన్ సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 03, ఖమ్మం,

వివిధ వ్యాధుల నిర్ధారణ కొరకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక సిటి స్కాన్ సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 2 కోట్ల 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటి స్కాన్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సిటి స్కాన్ అవసరాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు విన్నవించిన వెంటనే సత్వరమే స్పందించి ముఖ్యమంత్రివర్యులు జిల్లా ఆసుపత్రికి సిటీ స్కాన్ ను మంజూరు చేసారని మంత్రి తెలిపారు. 2 కోట్ల 15 లక్షల విలువ కలిగిన కెనాన్ కంపెనీ అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఐదు సంత్సరాలకు సరిపడా వార్షిక నిర్వహణకు మరో కోటి రూపాయలు విలువైన సిటీ స్కాన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో. కోవిడ్ తో పాటు వివిధ వ్యాధుల నిర్ధారణకు జిల్లా కేంద్రంలో సిటి స్కాన్ నిరంతరం అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా అన్ని వసతులను సమకూర్చుకున్నామన్నారు. జిల్లా ఆసుపత్రిలో 5 వందల పడకలకు పెంచుకోవడం జరిగిందని, కె.సి.ఆర్ కిట్ వల్ల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని, సర్జరీలు, సీజెరీయన్లును పూర్తిగా తగ్గించగలిగామన్నారు. ప్రస్తుతం ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించుకోవడం జరిగిందని, ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్నును ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా వివిధ వ్యాధుల నిర్ధారణ పరీక్షల సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేసారు. కోవిడ్ విపత్కర పరిస్థితులలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు మొదలుకొని చివరి శ్రేణి ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం అందించిన సేవలు అభినందనీయమని మంత్రి ప్రశంసించారు

డిప్యూటీ మేయర్ ఫాతిమా, జోహరా, స్థానిక కార్పోరేటర్ క్లైమెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా | ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి. వెంకటేశ్వర్లు, ఆర్ ఎంఓ డా॥ శ్రీనివాసరావు, ఆసుపత్రి వైద్యాధికారులు, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌరీ సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post