జిల్లా ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు…

జిల్లా ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు
– జడ్పి చైర్మన్ ఆంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక

జిల్లా ప్ర‌జ‌లంద‌రికి జడ్పి చైర్మన్ ఆంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమ‌న్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం,కేదారీశ్వర వ్ర‌తాలు చేయ‌డం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్ర‌జ‌లంద‌రు పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని, ట‌పాసులు కాల్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని సూచించారు.
——————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post