జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో “జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు” కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.      తేది:18.11.2021, వనపర్తి.

బాలల హక్కుల రక్షణ, సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
గురువారం వనపర్తిలోని ఎం.వై.ఎస్. ఫంక్షన్ హాల్ లో మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో “జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు” కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి విద్యను నేర్చుకోవాలని,  లక్ష్యాలను ఎంచుకొని దానికి అనుగుణంగా సాధన చేయాలని ఆమె సూచించారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలలకు అందవలసిన హక్కులపై అవగాహన కల్పించాలని,  చిన్నప్పటి నుంచే బాలలకు తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యతలను, విలువలతో కూడిన విద్యను అందించాలని, బాలల రక్షణకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె సూచించారు. పట్టుదలతో చదివి, చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె కోరారు.
కరోనా కారణంగా గత ఏడాది చాలా మంది చిన్నారులు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం జరిగిందని, ఇది బాధాకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. చిన్నారులలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి అంగన్వాడి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో బాల సదరం, వనపర్తి, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాల, కేజీబీవీ ఘనపూర్, పెద్దమందడి, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేసినట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పుష్పాలత, బాలరక్ష భవన్ కో-ఆర్డినేటర్, డి సి డి ఓ సుబ్బలక్ష్మి, అలివేలమ్మ, సిడబ్ల్యుసి చైర్మన్ వనజ, విజయ్ కుమార్, నళిని, సి.డబ్ల్యూ.సి. మెంటర్స్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
_______
జిల్లా పౌర సంబంధాల అధికారి,  వనపర్తి ద్వారా జారి చేయనైనది.

Share This Post