జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి. భవనంలో విశ్వగురు బసవేశ్వరుడి 889వ. జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

పత్రికా ప్రకటన.    తేది:03.05.2022, వనపర్తి.

కుల రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి, సామాజిక వేత్త బసవేశ్వరుడని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు.
మంగళవారం ఐ డి ఓ సి. భవనంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ మహాత్మ విశ్వగురు బసవేశ్వరుడి 889వ. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి, దానం, ధర్మం, సమ సమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త బసవేశ్వరుడని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షిని అధికారి, వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అధ్యక్షులు వరప్రసాద్, అధ్యక్షులు భాగ్యరాజు, ప్రధాన కార్యదర్శి శరభ లింగం, కోశాధికారి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, సంతోష్, శరత్, హరీష్, సంఘ పెద్దలు శివరాజ్, శివ కుమార్, సోమ జేఖర్, వీరేశ్, శివ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post