జిల్లా బ్యాంకర్లతో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి. సమీక్షా సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది: 17 .9 .2021
వనపర్తి

సకాలంలో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేసే రైతన్నను ఆదుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష బ్యాంకర్లను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి.పై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో బ్యాంకర్లు పంట రుణాలను సకాలంలో అందజేయాలని ఆమె ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తోడ్పాటు కొరకు ముందుకు రావాలని అన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యిప్పటి వరకు 43 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 26 దరఖాస్తులు బ్యాంకులలో పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. జిల్లాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల రుణాలను జాప్యం చేయరాదని వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి రూ.1 కోటి వరకు రుణాలు అందజేస్తామని ఎల్.డి.ఎం. తెలిపారు. బ్యాంకర్లలో ఏ స్కీములకు రుణాలు ఇస్తారు, స్కీములు వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు ద్వారా రుణాలు 7.7 శాతం మాత్రమే ఇచ్చారని, ఇంకా రుణ మొత్తం పెంచేలా హెడ్ ఆఫీస్ వారితో మాట్లాడాలని బ్యాంక్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో రూ. 91 కోట్ల రుణం ఇచ్చినందున బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో పెద్ద కారు రైతులు, ఆయిల్ పామ్ సాగు చేయడానికి రుణాలను తక్షణం అందజేయాలన్నారు. స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకునే పాడి పశువులకు సంబంధించిన రుణాలను మంజూరు చేయాలన్నారు. జిల్లాలో సేరికల్చర్ అభివృద్ధి చేయాలని ఆమె తెలిపారు. బ్యాంకర్లు ఆర్బీఐ సూత్రాలను పాటించి రుణాలు అందేలా చూడాలని అన్నారు. కార్పొరేషన్ ద్వారా బ్యాంకర్లకు పంపిన 51 దరఖాస్తుల లో సబ్సిడి.ఎవరికీ మంజూరు చేయలేదని ఎస్సీ కార్పొరేషన్ అధికారి తెలిపారు. సబ్సిడీ నిధులు పెండింగ్లో ఉన్నందున రుణాలు మంజూరు కాలేదని ఎస్టి శాఖ అధికారి కలెక్టర్ కు తెలిపారు. ఎస్బిఐ గ్రామీణ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ 18 నుండి 36 ఏళ్ల వయస్సు గలవారికి మొబైల్ రిపేర్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హౌస్ వైరింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తామని, ఎస్బిఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అధికారి డి.ఎస్.కె.ప్రసాద్ తెలిపారు.
ఈ సమావేశంలో నాబార్డు అధికారి శ్రీనివాస్, ఆర్బిఐ ఎల్.డి.వో.వైభవ్, ఏ.జి.యం.రామ్ ప్రసాద్, సి. యం. ప్రసాద్ రావు, ఏపీ.జి.వి.బి. సమ్యూల్.ఎల్ డి ఎం సురేష్ కుమార్, డిఆర్డిఓ నరసింహులు, ఎంప్లాయిమెంట్ అధికారి అనిల్, మల్లికార్జున, నుసిత, యాదమ్మ, ఏ ఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా చేయడమైనది.

Share This Post