జిల్లా మహిళా సోదరీమణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన- జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

జిల్లా కలెక్టర్ కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారిస్

గురువారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారిస్ నాగర్ కర్నూల్ ఇంచార్జ్ బ్రహ్మకుమారి సుజన, బ్రహ్మకుమారి ప్రభ, బ్రహ్మకుమారి విజయ లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ పండగ సందర్భంగా రాఖీలు కట్టారు.
శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా జిల్లాలోని మహిళా సోదరీమణులందరికీ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ హృదయ పూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కలెక్టర్ అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారిత సాధించేందుకు ప్రతి సోదరుడు, మహిళా సోదరీమణులకు చేయూతనందించేందుకు ప్రతి సోదరుడు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాఘవయ్య బ్రహ్మకుమారి వీణా, పాల్గొన్నారు.

Share This Post