జిల్లా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో పత్తి కొనుగోలు పై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.

మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో పత్తి కొనుగోలు పై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022 -23 సంవత్సరమునకు పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చేపట్టవలసిన ముందస్తు చర్యల పై, కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, పత్తి మిల్లుల్లో పనిముట్ల పనితీరును సదుపాయాలను తనిఖీ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
2022-23 ఖరీఫ్ సీజన్ నందు జిల్లాలో సాగు చేయబడిన పత్తి దిగుబడులను అంచనా వేసి కనీస మద్దతు ధర రూ.6,380/-గా నిర్ణయించబడినదని తెలిపారు. జిల్లాలో 14 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినదని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులనుసూచించారు.
పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలింపు విషయం లో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి జిల్లా తూనికలు కొలతల అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారి, సిసిఐ సిబ్బంది పత్తి మార్కెట్ కార్యదర్శులు పత్తి మిల్లు ట్రేడర్స్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post