జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ శుక్రవారం నాడు తన చాంబర్లో ఆవిష్కరించారు

Press release. Dt. 13.8.2021.

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ శుక్రవారం నాడు తన చాంబర్లో ఆవిష్కరించారు.
జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ లోని సమాచారం వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అధినేత కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆర్.రాజారామ్, జిల్లా పంచాయతీ అధికారి సునంద జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉప గణాంక అధికారి శివకుమార్, సిబ్బంది లక్ష్మణ్, రాజశేఖర్, రమేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

….DPRO. KMR.

Share This Post