జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టార్ ఫంక్షన్ హాల్ లో ” దావత్ – ఈ – ఇఫ్తార్” విందు : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన.   తేది:30.04.2022, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండగలకు సమ ప్రాధాన్యతను ఇస్తున్నదని, రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు.
శనివారం వనపర్తి పట్టణంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ” దావత్ – ఈ – ఇఫ్తార్” విందుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనారిటీల విద్యా, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీలు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన అన్నారు. తెలంగాణలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నదని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అనిల్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, జహంగీర్, వక్ఫ్ బోర్డు సభ్యులు అర్షద్, సీనియర్ లీడర్ అబ్దుల్ రహీమ్, కో ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్, మహమ్మద్ ఇమ్రాన్, టిఆర్ఎస్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు జో హబ్, అహ్మద్ హర్షద్, అహ్మద్ జహంగీర్, మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ బాషా, మహమ్మద్ సలీం, మౌలానా, అబ్దుల్ హాక్ అన్వర్, కాసిం, రహీమ్, ఆరిఫ్, రమేష్ గౌడ్, సంబంధిత అధికారులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post