జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా టైలరింగ్లో శిక్షణ పొందిన 25 మంది మైనారిటీ మహిళలకు శుక్రవారం నగరంలో కుట్టు శిక్షణా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ఉ చిత కుట్టు మిషన్లను అందజేశారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 06 ఖమ్మం:
స్వయం ఉపాధి రంగంలో మహిళలు ఆత్మస్థైర్యంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా టైలరింగ్లో శిక్షణ పొందిన 25 మంది మైనారిటీ మహిళలకు శుక్రవారం నగరంలో కుట్టు శిక్షణా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఉచిత కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం. చేసుకొని ఆర్ధికంగా మరింత అభివృద్ధి సాధించాలన్నారు. ప్రధానంగా మహిళలు గత మూడు నెలలుగా నేర్చుకున్న కుట్టు శిక్షణ ద్వారా తమ వృత్తి నైపుణ్యతను మరింత పెంపొందించుకొని, మారుతున్న ఆధునిక ఫాష్యన్స్ కనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రావిణ్యతను కలిగి ఉండాలన్నారు. గార్మెంట్స్, ఫ్యాబ్రిక్స్, టైలరింగ్కు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని, తదనుగుణంగా తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకొని స్వయం ఉపాధి, ఇతర సంస్థల సహకారంతో మరింత ఆర్ధికాభివృద్ధి సాధించి తోటివారికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలవేసారు.
జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి, న్యాక్ ఏ.డి నాగేందర్, కుట్టు శిక్షకులు షేక్ సమీనా, కృష్ణవేణి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

 

Share This Post