జిల్లా మొత్తంలో రేపటి నుండి వారి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల..

జిల్లా మొత్తంలో రేపటి నుండి వారి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో
వారి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్
మాట్లాడుతూ, రైతులు పండించిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో ఐకేపీ, డీసీఎంఎస్, పిఎసియస్, ఎయంసి, ఎఫ్ సి ఓ ల ద్వారా 137 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ వారి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం శుభ్రపర్చుకొని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినట్లయితే మద్దతు ధర లభిస్తుందన్నారు. సెంటర్ల వద్ద రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు తప్పకుండా వ్యవసాయ అధికారుల వద్ద టోకెన్లు తీసుకోవాలని సూచించారు. బ్రోకర్ లను సంప్రదించి రైతులు నష్టపోవద్దన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డిఆర్డిఓ కృష్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, వికారాబాద్ /తాండూర్ ఆర్డిఓ లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Share This Post