జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఖర్చు నమోదు చేస్తాము

జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది

జిల్లాలో ఎక్కడైనా  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఖర్చు నమోదు చేస్తాము

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్

హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్
000000

హుజురాబాద్   శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కర్ణన్ తెలిపారు.  శుక్రవారం హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులు, స్వతంత్ర అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో పాటు పక్క జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ఖర్చు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల లోపు వరుస లో ఉన్నవారికి టోకెన్ లిచ్చి ఓట్లు  వేసేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. పోలింగ్ రోజు ఉదయము ఆరు గంటలకల్లా పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్ లకు చేరుకునేలా చూడాలని అన్నారు. వారి సమక్షంలోనే పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారని  తెలిపారు.  కోవిడ్ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఓటర్లందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను పటిష్టమైన బందోబస్తు తో కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు ను తరలిస్తామని, పోలింగ్ ఏజెంట్లు కూడా రిసెప్షన్ సెంటర్ రావాలని సూచించారు. వారి సమక్షంలోనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లలో భద్ర పరుస్తామని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, డ్రైవర్ మొదలగు వారు కోవిడ్ టీకా ప్రోటోకాల్ ప్రకారం మొదటి డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారు , రెండవ డోసుకు అర్హత లేని వారు, పోలింగ్, కౌంటింగ్ తేదీలకు 72 గంటల లోపు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపొర్టు సమర్పిస్తే వారిని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతిస్తామని  కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. అలాగే ఒక డోసు కూడా కోవిడ్ టీకా తీసుకోకుండా ఉన్న  అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, డ్రైవర్ మొదలగు వారు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియకు  48 గంటల లోపు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే అనుమతిస్తామని తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ లో ఏర్పాటుచేసిన ఆర్ టి పి సి సెంటర్లలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి రిపోర్టులు ఇస్తారని కలెక్టర్ తెలిపారు.

Share This Post