జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దత్తత గ్రామం అయిన వాసాలమర్రి లో నిరుద్యోగ యువతి యువకులకు మరియు గ్రామీణ మహిళలకు ఉపాధి రంగాల్లో నైపుణ్యంను పెంచుటకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసి మూడు నెలల కాల వ్యవధిలో (అక్టొబర్ 2021 నుండి జనవరి 2022 వరకు) 5 రకాల ట్రేడులలో 151 మందికి శిక్షణను ఇవ్వడం జరిగినది.

గత నెల ఫిబ్రవరి 2022 లో నిర్వహించిన పరీక్షలకు 107 మంది హాజరైనారు. ఉత్తీర్ణత పొందిన 105 మందికి గౌరవ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆలేరు శాసన సభ్యురాలు,ప్రభుత్వ విప్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను వాసాలమర్రి గ్రామం లో రైతు వేదిక వద్ద ప్రధానం చేయడం జరిగినది.
ట్రేడుల వారిగా వివరాలు
1.కంప్యూటర్ యం.యస్.ఆఫీస్-31,
2.బ్యూటీషియన్ – 21,
3.మొబైల్ సర్వీసింగ్ – 09,
4.టైలరింగ్ – 33,
5.డొమెస్టిక్ ఎలెక్ట్రిషియన్ – 11.

అనంతరం గౌరవ MLA సునీతా మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ
వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకొని ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపినారు.అదే విధంగా
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతి యువకులకు మరియు గ్రామీణ మహిళలకు వివిధ రకాల వృత్తులలో నైపుణ్యాలను పెంచుకుని ఉపాధిని పొందడానికి ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని,
అదేవిధంగా వారు ఆర్ధికంగా బలపడటానికి దోహదపడుతాయనీ తెలియజేశారు.బంగారు తెలంగాణ కాల సాకారం చేసుకోవడం మన వాసాలమర్రి నుండె ప్రారంభం అవుతుంది అనీ,పలు అభివృద్ది పనులతో పాటు ప్రతి ఇంటిలో ఉపాది ఉండి ఆర్థికంగా బలంగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుందని, అలాంటి ఊరు స్వర్గంలా సువర్ణమయం అవుతూ ఉంటుందని అలాంటి ఊరూ ఊరూ కలిసి బంగారు తెలంగాణ గా రూపుదిద్దుకోనుందని…ఆ బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలునిచ్చారు.
అదే విధంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె.ధనుంజయనేయులు గారు మాట్లాడుతూ
ఈ రోజుల్లో ప్రతి ఒక్క రంగంలో కంప్యూటరు వినియోగం విరివిగా పెరగడం జరిగినది,అందులోనూ యం.యస్.ఆఫీస్ నేర్చుకోవడం వలన ఒక చిన్న జనరల్ స్టోర్ నుండి మల్టీ నేషనల్ కంపనీల వరకు దీని అవసరం చాలా ఉంటుందంటే అతిశయోక్తి లేకపోలేదు. దానితో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బ్యూటీషియన్ రంగం కూడా దినదినం అభివృద్ది చెందుతుంది.టైలరింగ్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మనిషికి తప్పనిసరిగా అవసరమైన అంశమే.
గార్మెంట్ రంగంలో మనం ఇంటి దగ్గరే ఉండి ఆదాయాన్ని పెంచుకునే చక్కటి మార్గం.అదే విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ప్రపంచాన్ని నూతన ఒరవడికతో సరికొత్త రంగుల ప్రపంచంలోకి తీసుకెళుతుంది.అదే విధంగా నేడు ఆధునిక ప్రపంచంలో కరెంట్ వినియోగం లేనిదే ప్రపంచ గమనమే లేదు అన్నట్లు తయారయింది. ప్రతి గృహంలో ఎలక్ర్టికల్ పని అనేది నిత్యావసర వినియోగం అయింది. ప్రతి రంగంలో ఎలెక్ట్రిసిటి తప్పనిసరి అవసరమే దానితో పాటు మొబైల్ రంగం గురించి మాట్లాడాలంటే మాటలు మనకు సరిపోవు….ఎందుకంటే ఈ ఆధునిక యుగం అరచేతిలో ప్రపంచం అనేది నేటి మొబైల్ ఫోన్…..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విషయాలను ఈ రోజు ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క అంశాలపై అవగాహన పెంచుకుంటున్నాం.అలాంటి రంగం మొబైల్ ఫోన్ రంగం ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతుల్లో పెన్ను ఉంటుందో లేదో తెలియదు కానీ మొబైల్ ఫోన్ మాత్రం ఉంటుంది.అలాంటి ఫోన్ రిపెరింగ్ అనేది చాలా అవసరమైన అంశం.
ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునేందుకు మనకున్న నైపుణ్యాన్ని పెంచుకునే ఇలాంటి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నయని, అదే విధంగా ఈ వాసాలమర్రి లో శిక్షణ పొంది ఉత్తీర్ణత సాధించిన అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తునట్లు తెలిపినారు.
ఈ కార్యక్రమములో స్థానిక సర్పంచ్ పోగుల అంజనేయులు గారు,
పలుగుల నవీన్ MPTC గారు,
శ్రీమతి భూక్యా సుశీల రవీందర్ గారు MPP.తుర్కపల్లి గారు,
శ్రీ నరసింహ రెడ్డి PACSచైర్మన్ గారు,
శ్రీ రహమత్ శరీఫ్ కో ఆప్షన్ మెంబర్ గారు
రైతు సమన్వయ చైర్మన్ నరసింహ గారు
మరియు ఫ్యాకల్టీలు రాజశేఖర్,నవీన్,రేణుకా,కైసర్,నవీన,ఇతర సిబ్బంది మురళి, సైదులు, రేణుకా తదితరులు పాల్గొన్నారు.

Share This Post