శుక్రవారం నాడు కేంద్రపర్యాటక, సాంస్కృతిక ,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రి కిషన్ రెడ్డి హనుమకొండ జిల్లా పర్యటన లో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.ఇంచార్జి డీఆర్వో వాసు చంద్ర , ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రిపట్టువస్త్రాలుసమర్పించారు. అనంతర మహా మండపంలో మంత్రికి వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనం చేసి అమ్మవారితీర్థప్రసాదాలందించారు.
అనంతరం మంత్రి వేయి స్తంబాల గుడినిసందర్శించారు.ఈసందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కి రుద్రేశ్వరుడి అభిషేకం చేసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం మంత్రికి ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి పట్టు వస్త్రాలు బహూకరించిన వేయిస్తంభాల గుడి అర్చకులు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని ఆకాంక్షించారు.హనుమకొండ నగరంలోని భద్రకాళి ఆలయం పర్యాటక కేంద్రంగా మారనుందని, ఇందులో భాగంగానే హృదయ్, స్మార్ట్‌సిటీ పథకం నిధులతో భద్రకాళి బండ్ అభివృద్ధి చెందిందన్నారు.అతి పురాతన, కాకతీయుల నాటి, ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆలయం వేయిస్తంభాల గుడి అని అన్నారు. భద్రకాళి దేవాలయానికి, వేయి స్తంభాల రుద్రేశ్వరాలయానికి ఎంతో అనుబంధం ఉందని, ఈ రెండు దేవాలయాలూ కాకతీయుల కాలంలో నిర్మితమైనవే అని. అన్నారు.జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి కి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.అనంతరం మంత్రి అదాలత్ జంక్షన్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.