జిల్లా లోని ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రిక ప్రకటన                                                                            తేది:2.11.2021

జిల్లా లోని ప్రతి ఇంట్లో  18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు స్పెషల్ సమ్మరీ రోల్స్ రివిజన్ (SSR)-2022 లో భాగంగా నిర్వహించాల్సిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాల  పై ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరు  ఓటు హక్కును కలిగి ఉండాలని,  జనవరి  1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన  ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 6, 7, 27, 28 తేదిలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఓటర్ల నమోదుతో పాటు చిరునామాలో మార్పులు, ఇతర సవరణలు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని అన్నారు..  ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాల  పై పూర్తి స్థాయి లో ప్రచారం చేసి ప్రజలలో  అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాల ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఓటు హక్కు గురించి తెలుసుకునేలా చేయాలనీ, ఓటర్ హేల్ప్ లైన్ యాప్ ను అందరు డౌన్లోడ్ చేసుకొని యాప్ పై అవగాహన పెంచుకోవాలని, ఓటర్ నమోదు ప్రక్రియ గురించి సలహాలు, సూచనల కొరకు ఏర్పాటు చేసిన  హెల్ప్ లైన్ నెం.1950 ను సంప్రదించవచ్చని అన్నారు.   జిల్లా లో ఉన్న9  డిగ్రీ కళాశాలల్లో “ఓటు వేద్దాం రండి”  అనే బుక్ పంపిణి చేసి, ఓటర్ కార్డు కోసం నమోదు చేసుకునేలా యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.  జిల్లాలో అర్హులైన ప్రతి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని అన్నారు.  జిల్లా లో మొత్తం 592 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, గద్వాల్ నియోజికవర్గం లో 303, అలంపూర్ నియోజికవర్గం లో 289, పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. ఓటరు జాబితా లిస్టు ఫైనల్ చేసుకొని,  ఓటర్ల పేర్లు ఉన్న ఏరియాకు దగరలోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అన్ని మండలాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్(BLO) లను నియమించుటకు  పొలిటికల్ పార్టీల వారందరికీ బిఎల్ఓ ల జాబితా ఇవ్వాలని అన్నారు.   మండలాల్లో ఎఇఆర్ఓ లు బి.ఎల్ఓ లతో సమావేశాలు ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్లు కలెక్టర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అన్నారు. బి.ఎల్.ఓ లు వారి పరిధి లో ఉన్న పోలింగ్ స్టేషన్ల గురించి పూర్తి వివరాలు , సమాచారం అందించాలని , ఓటర్ నమోదు ప్రక్రియ గురించి ప్రజలకు తెలియజేయాలని, ఓటర్ లకు సంబంధించిన  అభ్యంతరాలను  స్వీకరించి, ఓటర్ జాబితా లో  సవరణలు, మార్పులు, చేయాలనీ అన్నారు.   అన్ని పోలింగ్ స్టేషన్ లలో 6, 6A, 7, 8, & 8A ఫార్మ్స్  అందుబాటులో ఉంచాలని,  ప్రతి మండల నోటీసు బోర్డుల లో ఓటు నమోదు గురించి డిస్ప్లే చేయాలనీ అన్నారు.

సమావేశం లో డి డబ్య్లు ఓ ముసాయిదా బేగం, ప్రియాంక, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఏ డి ఏ సక్రియా నాయక్, ఏ.ఓ మధుసూదన్, నరేష్ కుమార్, సురేష్, ఫరూక్ సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారి చేయబడినది.

Share This Post