జిల్లా లోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్సు డిగ్రీ మరియు పి.జి కళాశాలకు “ జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్ “ రావడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

పత్రికా ప్రకటన                                                        తేది 11-08-2021

జిల్లా లోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్సు డిగ్రీ మరియు పి.జి కళాశాలకు “ జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్ “ రావడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

        బుధవారం కల్లెక్టరేట్ ఛాంబర్ లో రాష్ట్ర నోడల్ అధికారి శ్రీమతి శిరీష ప్రసాద్ అద్యక్షతన నిర్వహించిన జూమ్ సమావేశం లో మాట్లాడుతూ సానిటేషన్ , హైజింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ , వాటర్ మేనేజ్ మెంట్ , ఎనర్జీ మేనేజ్ మెంట్ మరియు గ్రీనరీ మేనేజ్ మెంట్ లలో అభివృద్ధి సాదించినందుకే జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్ అవార్డు వచ్చిందని తెలిపారు. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ అఫ్ రూరల్ ఎడ్యుకేషన్ , డిపార్టుమెంటు అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ & మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లో నిర్వహించిన కమిటీ ద్వారా కళాశాలకు జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్ రావడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు ను వర్చ్యువల్ మోడ్ పద్ధతి లో స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్రీమతి శిరీష ప్రసాద్ గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ చేతుల మీదుగా  బహూకరించడం జరిగింది.

        ఈ సమావేశం లో ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీపతి నాయుడు , జిల్లా నోడల్ అధికారి హరిబాబు, ఎన్.ఎస్.ఎస్. అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

————————————————————————– 

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post