జిల్లా లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                                        తేది: 08.10.2021

 

జిల్లా లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశము  హాలు నందు జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో మొత్తం ఎన్ని ప్రభుత్వ , ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, ఉన్న కళాశాలల్లో  ఎన్ని కోర్సులు ఉన్నాయని, ప్రతి సంవత్సరం ఎంత మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలకు మంచి గ్రేడింగ్ వచ్చేలా కాలేజీలను అభివృద్ధి చేయాలనీ అన్నారు. అన్ని కాలేజీలలో ఎన్ఎస్ఎస్, ఎన్.సి.సి ఉండాలని , హరిత హారం, ఎకో క్లబ్ ల నిర్వహణ కు ఎన్.ఎస్.ఎస్. విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు.  కొత్త కోర్సులను ప్రవేశ పెట్టి , ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అయ్యేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. సర్టిఫికేట్ కోర్సుల ద్వారా శిక్షణ ఇచ్చి విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకునేలా చూడాలని అన్నారు. డ్రాప్అవుట్ అయిన వారికి డిఆర్డిఎ అందించే ట్రయినింగ్ లపై అవగాహన కల్పించాలని అన్నారు. బిసి, ఎస్సి ,ఎస్టి విద్యార్తుల స్కాలర్ షిప్ ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలనీ అన్నారు. అర్హత ఉన్న విద్యార్థులందరికీ స్కాలర్షిప్ అందేలా చూడాలని అన్నారు. కళాశాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పై ప్రపోసల్స్ పంపించాలని అన్నారు.   కాలేజీల నూతన భవనముల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ,  మార్కింగ్ పూర్తి అయిందా , చేపట్టిన నిర్మాణాలు ఎ దశ లో ఉన్నాయని  అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. కళాశాలల్లో ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలకు  కాంపౌండ్ లేనందున  వెంటనే నిర్మాణం చేపట్టాలని అన్నారు. కాలేజీ ల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన కమిటీ (DCEDRC) లోని అధికారులందరు కాలేజీ ల అభివృద్ధి కొరకు , విద్యార్థులకు మంచి  భవిష్యత్తు కొరకు తమ వంతు కృషి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

సమావేశం లో MALD ప్రభుత్వ డిగ్రీ   కళాశాల ప్రిన్సిపాల్ శ్రీపతి నాయుడు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ పి.నవీన మంజులత,రాజేందర్  జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

Share This Post